రాయదుర్గం: కాన్పుకోసం వెళ్లి తల్లి బిడ్డ మృతి, తాళ్ళకెరలో హవిషాదం
గుమ్మగట్ట మండలం తాళ్లకెరకు చెందిన మనోజిత (మనెమ్మ) కాన్పు కోసం కర్ణాటకలోని పుట్టింటికి వెళ్లి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాళ్లకెరకు చెందిన రాజుతో మూడేళ్ల క్రితం మనెమ్మ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. పురిటి నొప్పులు రావడంతో బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కాన్పు జరిగి బిడ్డ మృతి చెందింది. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి కూడా మృతి చెందింది. ఒకే కాన్పులో తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.