ఉరవకొండ: పెంచలపాడు-గడేకల్లు మధ్య, రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని పెంచలపాడు-గడేకల్లు మధ్య బుధవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొంది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న కరకముక్కల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డికి తీవ్రగాయాలపాలు కావడంతో పాటు కాలు విరిగింది. క్షతగాత్రున్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లారు.