దండేపల్లి: గూడెంగుట్ట ఆలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు: పరిశీలించిన కలెక్టర్
కార్తీక పౌర్ణమి సందర్భంగా దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. తాగునీరు, పార్కింగ్, క్యూలైన్లు, పోలీస్ బందోబస్తుతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.