దండేపల్లి: గూడెం కార్తీక పౌర్ణమి జాతర: భక్తుల భద్రత కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఏర్పాట్లను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. భక్తుల భద్రత, గోదావరి ఘాట్ వద్ద జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.