చెన్నూరు: ఇందిరమ్మ జీవిత బీమా పథకం: అర్హులైన కుటుంబాలకు 5 లక్షల భరోసా
మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మంత్రి గడ్డం వివేకానంద ప్రారంభించారు. 18-59 ఏళ్ల మధ్య వయస్సున్న సంపాదించే వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుందని, మరణిస్తే 5 లక్షల పరిహారం అందుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.