మందమర్రి: మందమర్రి శివకేశవ ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
మంచిర్యాల జిల్లా మందమర్రి అంగడి బజార్ శివకేశవ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే శివునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మహిళలు తులసి మరియు ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.