రాయదుర్గం: ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, స్థంబించిన సేవలు
బ్యాంక్ యూనియన్ లతో చేసుకున్న ఒప్పందం మేరకు ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలో స్టేట్ బ్యాంక్ వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంక్ లావాదేవీలు స్థంబించాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు మహేశ్వర్, విజయ్, మురళి, ఎర్రిస్వామి, ఇందిర భవానీ, లక్ష్మి, లోకేష్, రవినాయక్, నవీన్, జగదీష్ తదితరులు తెలిపారు.