రాయదుర్గం: చంద్రబాబు, కరువు రెండూ కవలపిల్లలు : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి
చంద్రబాబు, కరువు రెండూ కవలపిల్లలు అని చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు వస్తుందని వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి ద్వజమెత్తారు. ఆదివారం రాయదుర్గంలో జరిగిన వైసిపి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీల అమలు చేయని తీరును ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు నవరత్నాల పేరుతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఈ విషయం ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు.