రాయదుర్గం: ధరలు అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సిపిఐ
పెరుగుతున్న నిత్యావసర ధరలను అధుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున మండిపడ్డారు. బుధవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి ఇచ్చారు. బియ్యం, పప్పులు, నూనె, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, సామాన్యుల జీవితం భారమైందన్నారు. ధరలు తగ్గించి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కొట్రేష్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.