మచిలీపట్నం: ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు త్వరితగతిన పరిహారం అందించండి: జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిపై కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 35 మంది బాధితులకు పరిహారం త్వరగా అందజేయాలని, సున్నిత ప్రాంతాల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.