రాయదుర్గం: రోడ్డు ప్రమాదానికి గురైన మాధవి ట్రావెల్ బస్సు, డ్రైవర్ కు గాయాలు
హైదరాబాద్ నుంచి రాయదుర్గం వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై అర్ధరాత్రి సమయంలో బూత్ పూర్ వద్ద రెండు లారీలు డీకొని ప్రమాదం జరిగింది. ఆ సంఘటన వద్ద అదే సమయంలో ఈ బస్సు ముందు వెళుతున్న ఐచర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు వెళ్లి ఐచర్ ను డీకొనింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణీకులు స్వల్పంగా కుదుపునకు గురయ్యారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.