ఉరవకొండ: పాల్తూరు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బీడీ మారయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా విడపనకల్ మండల పరిధిలోని పాల్తూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బీడీ మారయ్య అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ పయ్యావుల కేశవ్ గారు పాల్తూరు గ్రామంలోని బీడీ మారయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని స్వగృహానికి వెళ్లి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు.