కనిగిరి: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త కార్మికుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 32000 ఇవ్వాలని, పి.ఆర్.సి అమలు చేయాలని ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు.