ఉరవకొండ: కోనాపురం వద్ద గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో, ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోనాపురం వద్ద బుధవారం తృటిలో ఘోర పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోయే సమయంలో ట్రాక్టర్‌ను ఒక్కసారిగా బొలెరో వైపు తిప్పడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ మంజునాథ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గాయపడిన డ్రైవర్‌ను హైవే అంబులెన్స్‌లో అనంతపురం తరలించారు.