రాయదుర్గం: కణేకల్లు లో హిజ్రాతో యువకుడి ప్రేమ వివాహం, వీడియో వైరల్
అనంతపురం జిల్లా కణేకల్లుకు చెందిన జాను అనే హిజ్రాకు డి.హిరేహాల్ మండలం గొడిశలపల్లికి చెందిన వంశీ అనే యువకుడికి ప్రేమ వివాహం జరిగింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి బంధానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, బుధవారం కణేకల్లులోని నాగులకట్ట వద్ద హిజ్రాల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుక నిర్వహించారు. పెళ్లిలో హిజ్రా కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి, జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగులకట్ట వద్ద పూజలు చేసి, మంగళసూత్రం, పూలమాలలతో వేడుకను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చనీయాంశమైంది.