రాయదుర్గం: పట్టణంలో హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం
రాయదుర్గం పట్టణంలోని టౌన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రాణి సత్రం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సోమవారం లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించగా, మంగళవారం మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా హమాలీ కార్మికులు ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు గురుమాల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు మలకన్న, బండి కిష్టప్ప తనయుడు బండి హరీష్, హమాలీ నాయకులు బండి నాగరాజు, నాయకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్వయంగా భోజనం వడ్డించారు.