కనిగిరి: ఎడవల్లి వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
కనిగిరి మండలం ఎడవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను కనిగిరి మండలం కమ్మవారి పల్లి గ్రామానికి చెందిన కోలా ఎలైజర్, గుంటూరు సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.