రాయదుర్గం: రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు : రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ
ఈ నెల 15 న మారెమ్మ జాతరలు ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా గుమ్మగట్ట మండలంలోని పులకుంట, గోనబావి, జె. వెంకటాంపల్లి, కలుగోడు తదతర గ్రామాల ప్రజలు వలస వెళ్లి తిరిగి పోడుగ కోసం వస్తారని తెలిపారు. ఇక్కడ జరిగే జాతరల నేపథ్యంలో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని విలువైన ప్రాణాలు పోగొట్టుకోకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.