రాప్తాడు: చిన్మయ నగర్ ప్రసన్నాయిపల్లిలో సచివాలయ పరిధిలో సర్ ఓటర్ వెరిఫికేషన్ ను తనిఖీ చేసిన ఎమ్మార్వో చెన్నకేశవులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ప్రసన్నాయిపల్లి చిన్మయి నగర్ లో సచివాలయం నందు సార్, ఓటర్ వెరిఫికేషన్ ను గురువారం మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు ఓటర్ వెరిఫికేషన్ ఎమ్మార్వో చెన్నకేశవులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ చెన్నకేశవులు మాట్లాడుతూ ప్రసన్నాయిపల్లి చిన్నయ్య నగర్ సచివాలయ పరిధిలో సార్ ఓటర్ వెరిఫికేషన్ తనిఖీ చేయడం జరిగిందని ఓటర్ వెరిఫికేషన్ లో నోటీసులు అందుకున్న వారు తగిన సమాచారం ఇవ్వాలని లేకుంటే అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో చెన్నకేశవులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.