గిద్దలూరు: అర్ధవీడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల గ్రామాల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు ఇంటి పట్టాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పంపించేశారు. ఆర్డీవో శివ రంగారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన కృష్ణానగర్ లక్ష్మీపురం గ్రామాల ప్రజల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. ప్రభుత్వం నుంచి అందవలసిన పరిహారాలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు.