రాయదుర్గం: కంకర టిప్పర్ల రవాణాతో దుమ్ము దూలితో ఇబ్బందులు పడుతున్నామని మడేనహళ్లి గ్రామస్తుల ఆందోళన
కంకర టిప్పర్ల రవాణా వల్ల దుమ్ము దూలితో అనారోగ్యం పాలవుతున్నామని డి. హిరేహాల్ మండలం మడేనహళ్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలోని క్రస్సర్ల నుంచి రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ లు ఈ గ్రామం మీదుగా వెళుతున్నాయని తెలిపారు. క్రస్సర్ల యజమానులు కనీసం రోడ్డుపై నీరు కూడా చల్లరని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. దుమ్ముతో ఇటీవల శ్వాసకోశ వ్యాదులు, జలుబు దగ్గులతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు క్రస్సర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని, కనీసం రోడ్డుపై నీళ్లు చల్లేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.