కొండపి: సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ముందు మౌలాభి మృతికి న్యాయం చేయాలని నిరసనకు దిగిన బంధువులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తౌషిక్ మృతి ఘటనపై మరోసారి ఆందోళన నెలకొంది. తౌషిక్ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కుమారుడి మృతిపై న్యాయం కోసం పోరాడుతూ తల్లి మౌలాబీ మృతి చెందిన తర్వాత కూడా న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని బంధువులు తెలిపారు. మౌలాబీ మృతదేహాన్ని పోలీసుల అడ్డంకుల కారణంగా తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదని బంధువులు ఆరోపించారు. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ. "వుయ్ వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు చేశారు. తౌషిక్ మృతి ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.