రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించిన ఉపకులపతి జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆదివారం 11:30 గంటల సమయంలో ఉపకులపతి జ్యోతి కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు భారతదేశానికి స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి జైలుకు వెళ్లడం జరిగిందని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలోనూ ఆయన జీవితాంతం పోరాటం చేయడం జరిగిందని తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేసి నిజాయితీ గల వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగిందని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు.