కొండపి: మర్రిపూడి మండలంలో పశుగ్రాసం కొరతతో అవస్థలు పడుతున్న రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఎల్.ని.నో ప్రభావం రైతులను వేధిస్తుంది. పశుగ్రాసం కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు పశుగ్రాసం కొనుగోలు చేయవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. వచ్చే ఏడాదికి మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.