సంతనూతలపాడు: మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ మాసం 2026 పై అవగాహన
మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ మాసం 2026 కార్యక్రమం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ సూపర్వైజర్లు పద్మావతి, నాగరాజా మాట్లాడుతూ ... పౌష్టికాహార వినియోగం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారాన్ని గర్భవతులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాలన్నారు. ఆకుకూరలు పాలు కోడిగుడ్లు పప్పు ధాన్యాలతో తయారుచేసిన వంటకాలు వినియోగించడం వల్ల పోషక విలువలు ఎక్కువగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని సూచించారు.