సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో మంచినీటి చెరువులో శిధిలమైన గేట్ల స్థానంలో నూతన గేట్లను ఏర్పాటు చేసిన అధికారులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మంచినీటి చెరువులో నీరు అడుగంటడంతో రైతులకు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు గుండ్లకమ్మ జలాశయం నుండి నీటిని చెరువులోకి విడుదల చేశారు. చెరువులో గేట్లు శిథిలావస్థకు చేరి నీరు వృధాగా పోయే పరిస్థితి ఏర్పడడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. శిథిలావస్థకు చేరిన గేట్ల స్థానంలో ఆదివారం అధికారులు నూతన గేట్లను తయారు చేయించి ఆదివారం అమర్చారు. దీంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.