రాయదుర్గం: నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపిపి ఎన్నికలకు గెజిటెడ్ ఆఫీసర్లను నియమించిన జిల్లా కలెక్టర్
ఈనెల 19 న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు గెజిటెడ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బొమ్మనహాల్ మండలానికి కు విజిలెన్స్ క్వాలిటీ కంట్రోలర్ గోపాల్ నాయక్, డి.హీరేహాల్ మండలానికి FRO రామచంద్రుడు, కణేకల్ మండలానికి పశు సంవర్థక శాఖ ఏడి లక్ష్మీ శైలజ, గుమ్మగట్ట మండలానికి ఏడి శ్రీనివాసులు, రాయదుర్గం మండలానికి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమరేశప్ప ను నియమించారు.