దర్శి: వినాయక చవితి పండుగ సందర్భంగా దర్శిలో వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమలు అమ్మకానికి సిద్ధం
Darsi, Prakasam | Sep 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. విగ్రహాల పరిమాణం ఆకృతిని బట్టి ధరలు నిర్ణయించినట్లు విక్రయిదారులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారాలు చేస్తుంటామని పండగ సందర్భంగా వినాయక విగ్రహాల విక్రయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.