రాప్తాడు: రాప్తాడు బీసీ కాలనీలో వీర శైలుల లింగాహితుల విశ్వగురు బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు వీరశైవ లింగాయతుల విశ్వ గురువు బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ దాత శేఖర్ జయరాముడు తదితరులు మాట్లాడుతూ రాప్తాడు బీసీ కాలనీలో వీర శైవ లింగాయతుల విశ్వ గురువు అయిన బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామస్తుల కోరిక మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందని వీర శైలువ లింగాయతులు కోరిక మేరకే విగ్రహ ప్రతిష్టను చేయడం జరిగిందని భవిష్యత్తులో వారు అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని విగ్రహ దాత శేఖర్ జయరాముడు పేర్కొన్నారు.