ఉరవకొండ: జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లో టిడిపిని ఓడిస్తే రానున్న రెండున్నర సంవత్సరాలు సంక్షేమ పాలనైన అందిస్తారు
ప్రస్తుతం జరుగుతున్న జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను ఓటమిపాలు చేస్తే రానున్న రెండున్నర సంవత్సరాల కూటమి పాలనలో సంక్షేమ పథకాలను సక్రమంగా అందించే అవకాశమైనా ఉంటుందని ప్రజలు గమనించాలని బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కెవి రమణ, మాజీ ఎంపీపీ నరసింహప్ప, మాజీ జెడ్పిటిసి సింగాడి తిప్పయ్య లతో కలసి పేర్కొన్నారు. గురువారం ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెవి రమణ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం లో రైతులకు హెచ్.ఎల్.సి ద్వారా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, చాలా గ్రామాల్లో తాగునీరు సైతం అందించలేని దుర్గతి నెలకొంది.