గిద్దలూరు: గిద్దలూరు లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని పదవ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తరగతి గదిలో మొబైల్ ఫోన్ మర్చిపోయిన ఖాజావలికి మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు వెళ్లిన విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.