ఉరవకొండ: వజ్రకరూర్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఐడి కార్డుల పంపిణీ
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని మండల కేంద్రంలోశుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు అలాగే మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడెంటి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి వరకు ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీపీ జడ్పిటిసి ఎన్నికలకు అందరూ ఐక్యత గా పనిచేయాలని పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్మన్నారు.