రాప్తాడు: పంపునూరు నగరవనం వద్ద అప్పుడే పుట్టిన పసిపాపను వదిలి వెళ్ళిన గుర్తు తెలియని మహిళ దర్యాప్తు చేపడుతున్న ఆత్మకూరు పోలీసులు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు వద్ద శనివారం పదిన్నర గంటల సమయంలో నగరవనం సమీపంలో అటవీ ప్రాంతం నందు శనివారం ఒక మహిళ అప్పుడే పుట్టిన పసిపాపను అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోవడం జరిగింది రహదారిపై వెళుతున్న వాహనదారులు గమనించి స్థానిక ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారాన్ని తెలపడం జరిగింది ఐ సి డి ఎస్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఉన్న పసిపాపను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ సంఘటన పైన ఆత్మకూరు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అయితే పుట్టిన బిడ్డను అలా వదిలి వెళ్ళిన మహిళ ఎవరు ఎందుకు అలా చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.