సంతనూతలపాడు: చీమకుర్తి లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
చీమకుర్తి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చీమకుర్తిలోని జగనన్న కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తిలోని గంగవరం కు వెళ్ళు రహదారిలో ఉన్న జగనన్న కాలనీలో ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను గ్రానైట్ క్వారీలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావలసి ఉంది.