కనిగిరి: మంత్రి నారా లోకేష్ చేతుల మీదగాట్రిపుల్ ఐటీ కళాశాల శంకుస్థాపన: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ కళాశాల శంకుస్థాపనకు మంత్రి నారా లోకేష్ త్వరలో రానున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం తెలిపారు.కళాశాల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారని, మరో రూ .100 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి వస్తున్న సీఎం చంద్రబాబుకు కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాల నుండి రైతులు, ప్రజలు, టిడిపి కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలకనున్నారు.