రాయదుర్గం: వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి : రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ
వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవడానికి ప్రతీఒక్కరూ పోలీసులతో సహకరించాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. కణేకల్ లో మండపాల నిర్వాహకులతో సమావేశం జరిపాంచారు. ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని, DJలకు పర్మిషన్ లేదన్నారు. ట్రాఫిక్, శాంతిభద్రతలకు ఆటంకం కలిగించరాదని హెచ్చరించారు. నిమజ్జనం రాంనగర్ HLC కెనాల్ వద్ద నిబంధనల ప్రకారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నాగమధు పాల్గొన్నారు.