రాప్తాడు: పంగల్ రోడ్డు సెయింట్ విల్సన్ డిపాజిట్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పొంగల్ రోడ్డు వద్ద సెయింట్ విన్సెంట్ డిపో పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయం లో న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ చట్టాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విన్సెంట్ డిపాల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలే నిర్ణీతలని ప్రజల కోసమే చట్టాలు ఉన్నాయని వాటిలో కొన్ని అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికారి ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు పాల్గొన్నారు.