కొండపి: సింగరాయకొండ లోని నవోదయ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ప్రైవేటు నవోదయ పాఠశాలలు ఆరవ తరగతి చదువుతున్న కనిగిరి కి చెందిన తౌశిక్ జనవరి నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లి మౌలాభి తన కుమారుడిని పాఠశాల యాజమాన్యమే హత్య చేసిందని ఆరోపిస్తూ 8 నెలలుగా న్యాయపోరాటం చేస్తుంది. రెండు రోజుల క్రితం పాఠశాల ముందు నిరసన తెలుపుతూ విషద్రవం తాగింది. మౌలాభి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మౌలాబి శనివారం మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. మౌలాభి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కనిగిరికి తరలిస్తున్నారు.