సంతనూతలపాడు: ఈదుముడి గ్రామానికి చెందిన రోశయ్యకు బ్రెయిన్ డెడ్, రోశయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన బక్క రోశయ్యకు కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగింది. నాలుగు రోజులుగా మృతువుతో పోరాడారు. చివరికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆదివారం రోశయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మరో నలుగురికి రోశయ్య అవయవాలు ద్వారా ప్రాణదానం చేసినందుకు కుటుంబ సభ్యులను స్థానికులు, వైద్యులు, సిబ్బంది అభినందించారు. రోశయ్య కు జోహార్లు అర్పించారు