దర్శి: కురిచేడులో అక్రమ మద్యం విక్రయం: 15 సీసాలు స్వాధీనం
Darsi, Prakasam | Nov 13, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు శివారులో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రెస్టారెంట్ సమీపంలో 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. కోటయ్య తెలిపారు.