కనిగిరి: హనుమంతునిపాడు లో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసి ఎన్నికలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవం
హనుమంతునిపాడులో ఎస్ఎంసి ఎన్నికలు గురువారం ప్రశాంతమైన వాతావరణం లో ముగిశాయి. హనుమంతునిపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్గా ముద్ద యాకోబు, వైస్ చైర్మన్ గా కత్తి మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గా గాయం రామయ్య, వైస్ చైర్మన్ గా హుస్సేల సుజాత ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. వీరితోపాటు మరో పదహారు మంది సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయులు చైర్మన్, వైస్ చైర్మన్ల తో ప్రతిజ్ఞ చేయించారు.