రాయదుర్గం: 2028 నాటికి జీడిపల్లి - భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల జీవనాడి అయిన జీడిపల్లి-భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2028 నాటికి పూర్తి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అండదండలతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు నాయకత్వంలో ఈ పనులు పూర్తి చేసి, కరువుపీడిత రాయదుర్గం-కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కృష్ణా జలాలు పారిస్తామన్నారు.