కనిగిరి: పట్టణంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమ కాటు అనర్ధాలపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
కనిగిరి పట్టణంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నుండి మొదలైన ఈ ర్యాలీ కార్యక్రమం ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ... దోమ కాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, బోదకాలు వంటి తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. దోమలు కొట్టకుండా ప్రజలు దోమతెరలు వాడాలని, ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంద