నారాయణపేట్: నారాయణపేటలో జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు: 500 మంది క్రీడాకారిణుల భాగస్వామ్యం
నారాయణపేట స్టేడియం గ్రౌండ్లో జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపికలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది మహిళా క్రీడాకారిణులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.