రాయదుర్గం: 121 ఏళ్ళ చరిత్ర కలిగిన రాయదుర్గం రైల్వే స్టేషన్ లో శతాబ్ది ఉత్సవాలు జరపాలి : హెరిటేజ్ అసోషియేషన్
121 ఏళ్ళ చరిత్ర కలిగిన రాయదుర్గం రైల్వే స్టేషన్ లో శతాబ్ది మహోత్సవాలు నిర్వహించాలని హెరిటేజ్ అసోసియేషన్ కేంద్ర రైల్వే బోర్డును కోరింది. గురువారం రాయదుర్గం R&B అతిథి గృహంలో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి హులికుంటి మూర్తి, నైరుతి రైల్వే సలహా మండలి మాజీయసభ్యుడు గుడేకోట శివకుమార్ మాట్లాడారు. 1905 ఏప్రిల్ 1న ప్రారంభమైన బళ్లారి-రాయదుర్గం లైన్ ఏర్పాటు అయిందన్నారు. 100 ఏళ్లు పూర్తయిన 109 స్టేషన్ల జాబితాలో రాయదుర్గం లేకపోవడం బాధాకరమన్నారు. శతాబ్ది ఉత్సవాల నిర్వాహణ తో పాటు అమృత్ 2.0 లో బాగంగా అభివృద్ధి చేయాలని కోరారు.