రాయదుర్గం: మండల స్థాయి చెకుముకి సైన్స్ ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించిన జన విజ్ఞాన వేదిక
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్ ట్యాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని జన విజ్ఞాన వేదిక జోనల్ అద్యక్ష ప్రధాన కార్యదర్శులు శివానంద, నాగరాజు అన్నారు. శుక్రవారం మండల స్థాయి చెకుముకి పరీక్షలు రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హిరేహాల్ మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రసంశ పత్రాలు ఇస్తూ బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి టీం లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జగదీష్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.