దర్శి: దర్శి పట్టణంలో నాలుగు రోజులపాటు నిలిచిపోయిన బ్యాంకు సేవలు
Darsi, Prakasam | Sep 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలో నిలిచిపోయాయి. సెప్టెంబర్ 11వ తేదీ బ్యాంకు ఉద్యోగులు సమ్మె, 12వ తేదీ శనివారం 13వ తేదీ ఆదివారం 14వ తేదీ వినాయక చవితి సెలవు కావడంతో బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులకు కొంత అసౌకర్యం తప్పదు. తిరిగి సెప్టెంబర్ 15న మంగళవారం బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి.