రాయదుర్గం: పాముకాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించాలి : కణేకల్లు వైద్యాధికారి డాక్టర్ యశ్వంత్
పాము కరిస్తే భయపడకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని కణేకల్లు యూపిహెచ్చి వైద్యాధికారి డా.యస్వంత్ అన్నారు. మొదటి గంట గోల్డెన్ అవర్ అని, మంత్రాలు, పసర్లు, నాటువైద్యంతో సమయం వృథా చేయొద్దని సూచించారు. యాంటీ-వెనమ్ మాత్రమే పరిష్కారమని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది ఉచితమని తెలిపారు. కాటు భాగాన్ని కదపకుండా, గట్టిగా కట్టకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు.