ఉరవకొండ: భక్తిశ్రద్ధలతో సామూహిక సంకష్టహర చతుర్థి పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో సామూహిక సంకష్టహర చతుర్థి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో స్వామి వారి మూలవిరాట్ కు అర్చక పండితులు రాంబాబు స్వామి పూజా కైంకర్యాలలో భాగంగా పంచామృతాభిషేకాలు పుష్పాలంకరణ సేవలు పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా భక్తులు నియమ నిష్ట ఉపవాస దీక్షలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.