నారాయణపేట్: గుండుమాల్లో ముగిసిన 'కౌశల్ బోధ్' శిక్షణ: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి కీలక అడుగు
గుండుమాల్ తెలంగాణ మోడల్ స్కూల్లో మూడు రోజుల 'కౌశల్ బోధ్' ప్రీ-వొకేషనల్ శిక్షణ ముగిసింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రాజెక్టులను ఆచరణలో పెట్టాలని ఏఎంఓ విద్యాసాగర్ సూచించారు. 28 పాఠశాలల నుంచి 130 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.